BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

Select Suryaa Now
ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమండ్రి

స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర మతపరమైన ప్రార్థనా స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించరాదని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రార్థనా స్థలాల వద్ద రాజకీయ ప్రసంగాలు చేయడం, పార్టీలు లేదా అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించడం, ఓట్ల కోసం మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు.

ఆదివారం దేవరపల్లి ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరంలో మత విశ్వాసుల సమావేశాన్ని ఎన్నికల ప్రచారానికి వేదికగా ఉపయోగించి, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించినట్లు అధికారుల దృష్టికి వచ్చిందని  తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను పరిశీలించిన అనంతరం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి  పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు  నమోదు చేశారు.భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించడానికి అనుమతి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, వారి ప్రచారకర్తలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తూ మతపరమైన ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు గుర్తించినా, ఫిర్యాదులు అందినా విచారణ జరిపించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని  కోరారు.

-