BREAKING
వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసి.. నీటి భద్రతకు జిల్లా సమగ్ర కార్యాచరణ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కిటకిట: - స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఆర్టీసీ బస్సు ప్రారంభించిన సర్పంచ్ పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: అమీనుద్ధీన్, భాగ్యానంద్ ఖాకీ నిఘాపై దొంగల"చెయ్యి"- రాజీవ్‌ రహదారిపై రెచ్చిపోయిన స్నాచర్లు అమిత్ షా రాకతో కాంగ్రెస్ లో గుబులు.... సింగరేణిలో రూ.330 కోట్ల సోలార్ ప్లాంట్ లకు గ్రహణం...!!! ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం

Select Suryaa Now
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం

ఆంధ్రప్రదేశ్‌లో నేడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న దాడులు, దౌర్జన్యాలు, ఎన్నికల అక్రమాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలాయని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు కల్పించాల్సిన ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థ భయానక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద భయానక పరిస్థితులు సృష్టించడం, ఓటర్లను బెదిరించడం, పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడులేనని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో అక్టోబర్ 15 నుంచి 29వ తేదీ వరకు ఏకంగా 61 ఎన్నికల సంబంధిత కేసులు నమోదవడం రాష్ట్రంలోనే అత్యధికం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. ఇంతటి సమస్యాత్మక పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని గుర్తుచేశారు.

మరోవైపు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేసి ఫిర్యాదు చేయడం ఎన్నికల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. ఎన్నికల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ఎన్టీవీ, ఇండియా టుడే మీడియా ప్రతినిధులపై దాడులు చేసి కెమెరాలను ధ్వంసం చేయడం పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నమని మండిపడ్డారు.

ఇన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం సమర్థంగా స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలవలేమనే భయంతోనే అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. చంద్రబాబు నిజంగా ప్రజల మద్దతు ఉందని భావిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోవాలి తప్ప, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల ఓటు హక్కును కాలరాయకూడదని హితవు పలికారు.

జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బూత్‌ల ఆక్రమణలు, దొంగ ఓట్లు, ఓటర్లను అడ్డుకున్న ఘటనలపై ఆధారాలను పరిశీలించి అక్రమాలు నిర్ధారణ అయిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి