మార్టిన్ లూథర్ ఉద్యమం చారిత్రాత్మక ఘట్టం..
బుట్టాయిగూడెం: మేజర్ న్యూస్: ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి, సేవాభావంతో జీవించాలని సెయింట్ మార్క్ లూథరన్ చర్చ్ ప్యారిస్ పాస్టర్ ఎం ఆమెన్ తెలిపారు. మతోద్దరణ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమo సంఘ డెలికేట్ కాశీ విమల కుమారి ఆధ్వర్యంలో జరిగింది. సంఘస్తులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ఆమెన్ మాట్లాడుతూ మార్టిన్ లూథర్ చేపట్టిన మతసంస్కరణ ఉద్యమం క్రైస్తవ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పారు. బైబిల్ బోధనలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆయన ఆశయం నెరవేరిందని ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ని ఆచరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
బైబిల్ పఠనం ఆధ్యాత్మిక సందేశాలు దేవుని వాక్యాన్ని చదవడం, ఆచరించడం ద్వారా ప్రేమ, క్షమాపణ, శాంతి, సేవాగుణాలను అలవర్చుకోవాలని విశ్వాసులకు సూచించారు.
మార్టిన్ లూథర్ చేసిన కృషిని స్మరించుకుంటూ, బైబిల్ బోధనలను నిత్యజీవితంలో పాటించాలని వివరించారు.
దేవుని వాక్యమే మనిషికి నిజమైన మార్గదర్శకమని ఈ బైబిల్ పండుగ క్రైస్తవుల జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆల్టర్నేట్ డెలికేట్ బుడుపుల పద్మమాలిని, పిసిసి, ఎల్సిసి సభ్యులు గేదెల వరప్రసాద్, కట్టారత్నకుమారి, గుర్రం యోహాను, గంధం బున్నీ, కోడూరి రేవంత్, గోళ్ళ నీలరు గన్యా, బట్టు రవికుమార్, తలారి ఆశ, దౌలూరి సురేష్, బట్టు టోని,నున్న రాజు, తదితరులు ఉన్నారు. మధు (నాని) బుట్టాయిగూడెం, ఏలూరు జిల్లా.