జంగారెడ్డిగూడెంలో 61.06 శాతం పోలింగ్
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని మొత్తం 32 వార్డుల్లో 61.06 శాతం పోలింగ్ నమోదైనట్లు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 48,463 మంది ఓటర్లకు గాను 29,591 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఓటింగ్ సరళిని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, కూటమి అభ్యర్థి రొంగల అనూష కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు.