BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

అమిత్ షా రాకతో కాంగ్రెస్ లో గుబులు....

Select Suryaa Now
అమిత్ షా రాకతో కాంగ్రెస్ లో గుబులు....
 
సూర్య, గొల్లపల్లి : ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవహేళన చేసిన మోడీ, అమిత్ షా తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని బిజెపి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. 1969 లో తెలంగాణ తొలి విడత ఉద్యమం ప్రారంభమైనప్పుడు 369 మంది ప్రాణ త్యాగం చేశారని అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న విషయం మంత్రి పొన్నం తెలుసుకోవాలని అన్నారు.  9 డిసెంబర్ 2009 తేదీన సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును  ఎందుకు ఏర్పాటు చేయలేదని దాని కారణంగానే 1200 మంది తెలంగాణ విద్యార్థులు యువకులు అమరులు అయ్యారని దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ మీద పార్లమెంట్ సాక్షిగా పెప్పర్ స్ప్రే చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులేనని బిజెపి వారు కాదన్నది మంత్రి పొన్నం గుర్తెరగాలని అన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసి ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి హాకీ కర్రతో తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన దానం నాగేంద్ర లాంటి వారిని పార్టీలో చేర్చుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి అపజయం ఎదుర్కొంటుందని అది జీర్ణించుకోలేక  బిజెపిపై సర్ ను అడ్డం పెట్టుకొని నిజమైన భారతీయుడు ఏ ఒక్కరు ఓటు హక్కును కోల్పోకున్న అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమిత్ షా,మోదీ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు మొదలైందని అన్నారు.తెలంగాణలో కులగణన స్పష్టంగా చేసినామని పదేపదే వల్లించే పొన్నం తెలంగాణలో జరిగిన జనగణనలో ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదని తేలిందని అది లోపబూయిష్టంగ ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బిజెపి పార్టీ పెద్దన్న పాత్ర పోషించిన విషయం పొన్నం తెలుసుకోవాలని 2009లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే 1200 మంది యువకులు విద్యార్థులు బలి అయ్యేవారు కాదని వారి ఆత్మ ఘోష తగిలి కాంగ్రెస్ పార్టీ పతనం కానుందని అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసి అరాచకాలు సృష్టించి ప్రశాంతంగా ఉన్న దేశంలో అస్థిరం చేసి అల్లకల్లోలం చేయాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటుందని అది మోదీ,అమిత్ షా నేతృత్వంలో కుదరని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు చెవులమద్ది శేఖర్ మాజీ మండల అధ్యక్షుడు కట్ట మహేష్  ప్రధాన కార్యదర్శి సింహాచలం సత్యనారాయణ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సంగెం కళ్యాణ్ మండల ప్రధాన కార్యదర్శి దూస ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు...