BREAKING
అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు రామ్ లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ మహా సభ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం

ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్

Select Suryaa Now
ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరామచంద్రాపురం పురపాలక ఎన్నికల్లో ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మొత్తం 32 వార్డుల్లో 50 పోలింగ్ బూత్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. మొత్తంగా 70.73% పోలింగ్ నమోదు కాగా 35728 ఓటర్లకు గాను 25270 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అందులో పురుషులు 17188 ఉండగా వీరిలో 12113 మంది ఓటు హక్కును వినియోగించుకోగా మహిళలు 18540 మందికి గాను 13157 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా రెండో వార్డులో 81.61 శాతం పోలింగ్ నమోదు కాగా అతి తక్కువగా 12వ వార్డులో 58.59% నమోదయింది పట్టణంలోని రత్నంపేట మున్సిపల్ స్కూల్ నందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు టిడిపి చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు ఆరో వార్డులో ఓటు వేశారు వైసీపీ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు పదో వార్డు శాంతినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం పోలింగ్ సరళి మందకోడిగా సాగగా మధ్యాహ్నం నుంచి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను చింతపల్లి సూరన్న నగర్ లో గల స్ట్రాంగ్ రూముల వద్దకు చేర్చారు రామచంద్రపురం డి.ఎస్.పి ఎం శేషు నేతృత్వంలో సిఏ వెంకటనారాయణ పర్యవేక్షణలో పట్టణంలో పోలింగ్ బూతులు వద్ద బందోబస్తు నిర్వహించారు