telangana
ఆర్టీసీ బస్సు ప్రారంభించిన సర్పంచ్
సూర్య రామడుగు . రామడుగు మండలం గోలి రామయ్య పల్లి గ్రామంలో ఆదివారం నూతనంగా ఆర్టీసీ బస్సును సర్పంచ్ నునుగొండ అంజలి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నునుగొండ అంజలి మాట్లాడుతూ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించామని అన్నారు. ఈ బస్సు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి కొక్కెరకుంట మోతె గోలిరామయ్యపల్లి కొరటపల్లి షానగర్ గ్రామాల మీదుగా రామడుగు మండల కేంద్రం నుండి గోపాల్ రాపేట్ వరకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ధ్యావ అనంతరెడ్డి సర్పంచులు మొయిజ్ గుమ్మడి మల్లేశం వార్డు సభ్యులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.