అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం.
కూటమి ప్రభుత్వంతో ప్రజల్లో ఆనందం.
జగన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.
అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేయడమే గొడ్డలి పార్టీ లక్ష్యం.
గత ఐదేళ్లలో వ్యవస్థలన్నిటిని నాశనం చేసిన జగన్.
దర్శి జడ్పిటిసి కూటమి అభ్యర్థి లక్ష్మీ తాయారును అఖండ మెజార్టీతో గెలిపించాలి. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ సంక్షేమ అభివృద్ధి పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని, గత ఐదేళ్లలో వ్యవస్థలును అన్నిటిని జగన్ నాశనం చేశాడని ,గొడ్డలి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. కూటమి జడ్పిటిసి అభ్యర్థి వరికూటి లక్ష్మీ తయారు విజయాన్ని ఆకాంక్షిస్తూ దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఆదివారం మండలంలోని కొత్తపల్లి గ్రామం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు .దర్శి జడ్పిటిసి జనసేన అభ్యర్థి వరికూటి లక్ష్మి తాయారు ని గెలిపించవలసినదిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ మంచి చేసే పార్టీని ఆదరించి అభిమానించి ఓటెయ్యాలని కోరారు. అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయడమే గొడ్డలి పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆమె అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వాని దేనని డాక్టర్ లక్ష్మి అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మున్సిపల్ నూతన చైర్మన్ దారం సుబ్బారావు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, జనసేన నాయకులు వరికూటి నాగరాజు, మరియు కొత్తపల్లి టిడిపి నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, అంబటి గోవిందరెడ్డి గ్రామంలోని స్థానిక నాయకులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.