BREAKING
అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు రామ్ లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ మహా సభ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం

సింగరేణిలో రూ.330 కోట్ల సోలార్ ప్లాంట్ లకు గ్రహణం...!!!

Select Suryaa Now
సింగరేణిలో రూ.330 కోట్ల సోలార్ ప్లాంట్ లకు గ్రహణం...!!!

సూర్య, సెంటినరీకాలనీ  :సింగరేణి ఆర్జీ-3 డివిజన్ లో సోలార్ ప్లాంట్ లకు గ్రహణం ఏర్పడింది. సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా సోలార్(సౌర విద్యుత్) పవర్ పై దృష్టి సారించింది. లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి డివిజన్ లో వృధా ఉన్న సింగరేణి స్థలాల్లో సోలార్ ప్లాంట్ లను నిర్మించింది. సోలార్ ఎనర్జీని భారీగా వినియోగంలోకి తెచ్చింది. కానీ ఆర్జీ-3 డివిజన్ లో 3 దశలుగా సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేయగా రెండు ప్లాంట్ లను గ్రహణం చుట్టుకుంది. నిధులు కేటాయించిన పనులలో తీవ్ర జాప్యం జరుగుతుంది. డిసెంబర్-2021 వ సంవత్సరంలో 50 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ముల్కలపల్లి ప్రాంతంలో 250 ఎకరాలలో రూ.200 కోట్లతో నిర్మించారు. ఇది సక్సెస్ అయింది. ఈ ప్లాంట్ ద్వారా భారీ విద్యుత్ జెనరేట్ అవుతుంది.


రూ:126 కోట్ల ప్లాంట్ 3 ఏళ్లుగా నత్తనడక...!

ఆర్జీ-3 డివిజన్ లో ఓసీపీ-1 డంప్ యార్డ్ పై, ఇతర ప్రాంతాల్లో 22 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణానికి గ్రహణం పట్టింది. అక్టోబర్-2022 వ సంవత్సరంలో టెండర్లు పిలిచారు. డిసెంబర్-2023లో నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి 105 ఎకరాల భూమిని, రూ.126 కోట్ల నిధులు కేటాయించారు. మూడు సంవత్సరాలు దాటిన 80 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. గుజరాత్ రాష్ట్రముకు చెందిన జెన్ సోల్ కంపెనీ ఈ టెండర్లు దక్కించుకుంది. ఈ కాంట్రాక్టర్ స్టాక్ మార్కెట్ లో సెబీ కేసు లో ఇరుక్కోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన రూ.50 కోట్లతో తిరిగి టెండర్లు పిలిచారు. నవంబర్-11వ తేదీ వరకు టెండర్ల ఆఖరి తేదీ గడువుగా తెల్సింది.

రూ.204 కోట్ల సోలార్ ప్లాంట్ కు గ్రహణం...!

ఆర్జీ-3 డివిజన్ లో 37 మెగా వాట్ల ప్లాంట్ కు 185 ఎకరాల భూమి కేటాయించారు. రూ.204 కోతలతో జూలై-2025 లో టెండర్లు పిలిచారు. గుజరాత్ రాష్ట్రము కు చెందిన గోల్డి సోలార్ కంపెనీ పనులు దక్కించుకుంది. ఓసీపీ-1లో 70 ఎకరాల్లో ఓబీ కుప్పలపై, 24 ఎకరాలలో, సెంటినరీ కాలనీ లోని శ్రీలంక క్వార్టర్ల వద్ద ఖాళీ స్థలంలో 17 మెగావాట్ల సోలార్ ను, సెంటినరీకాలనీ లోని జిటి హాస్టల్ ఎదురుగా 25 ఎకరాల్లో, జేఎన్టీయూ, హార్టికల్చర్ కళాశాల ప్రాంతంలో 27 ఎకరాలలో, జేఎన్టీయూ ప్రహరీ గోడను అనుకోని ఉన్న మసీద్ ప్రాంతంలో 2.17 ఎకరాలలో 20 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఓబీ కుప్పలపై పనులు కొనసాగు...తుండగా, మిగతా ప్రాంతాల్లో పనులు నత్త నడకతో పోటీపడుతున్నాయి. సెంటినరీకాలనీ ప్రాంతంలో సింగరేణి సంస్థ 19 వేల వెదురు చెట్లను తొలగించింది.  5.9 కిలోమీటర్ల దూరంతో రూ.3 కోట్లు వెచ్చించి ప్రహరీగోడ నిర్మించింది. కాగ 31.08.2026 వరకు సోలార్ నిర్మాణం కావాల్సి ఉండగా పనులు జరగడం లేదు. ఆర్అండ్ఆర్ సైట్ కోసం స్థలం ఆపినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతంలో సోలార్ పనులను గ్రహణం పట్టింది.


టెండర్లపై కాంట్రాక్టర్ లు ఎందుకు ఇంత నిర్లక్ష్యం...!

గుజరాత్ కంపెనీలు సోలార్ టెండర్లు దక్కించుకుంటున్నాయి. వేలాది కోట్లతో టెండర్లు పిలవడం పనులు కాస్తా ముందుకు సాగకపోవడంతో సోలార్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్లు వేసే కాంట్రాక్టర్ లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

సబ్ కాంట్రాక్టర్ లకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన జెన్ సోల్ కంపెనీ:-

ఆర్జీ-3 డివిజన్ లో 22 మెగావాట్ల సోలార్ ప్లాంట్ టెండర్లు దక్కించుకున్న గుజరాత్ జెన్ సోల్ కంపెనీ కాంట్రాక్టర్ కోట్లాది రూపాయలు సబ్ కాంట్రాక్టర్ లకు ఎగ్గొట్టారు. రూ.126 కోట్ల పనులలో సుమారు రూ.110 కోట్ల పనులు పూర్తి అయినట్లు తెలిసింది. గత సంవత్సరం ఏప్రిల్ లో సదరు గుజరాత్ కంపెనీ చేతులెత్తేసింది. సబ్ స్టేషన్ ఇన్స్టాలేషన్ కాంట్రాక్టర్ కి రూ.6 కోట్లు, ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్టర్ కి రూ.25 లక్షలు, జనరేటర్  కాంట్రాక్టర్ కి రూ.3 లక్షలు ఎగగొట్టినట్లు తెలిసింది. ఈఎండి, బిజీ లు ఆపుకున్న సింగరేణి యాజమాన్యం సబ్ కాంట్రాక్టర్ లకు సహకరించడం లేదు. తమకు సంబంధం లేదని సింగరేణి అధికారులు తేల్చి చెపుతున్నారు. కాగా నూతనంగా రూ.52 కోట్లతో టెండర్లు పిలువగా ఆ పనులు అడ్డుకోవడానికి కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

కంపెనీ పై అదనపు భారం రూ.36 కోట్లు...??

ఆర్జీ-3 డివిజన్ లో 22 మెగావాట్ల సోలార్ ప్లాంట్ టెండర్లు దక్కించుకున్న గుజరాత్ జెన్ సోల్ కంపెనీ చేసిన నిర్వాహకంతో కంపెనీ పై అదనపు భారం పడుతుంది. రూ.126 కోట్ల టెండర్లలో సుమారు రూ.110 కోట్ల పనులు పూర్తి అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా పాత టెండర్ లో రూ.16 కోట్ల నిధులు మిగిలాయి. ప్రస్తుతం రూ.52 కోట్లతో టెండర్లు పిలిచారు. అంటే రూ.36 కోట్ల అదనపు భారం సింగరేణిపై పడినట్లు తెలిసింది. దీనికి బాధ్యతగా ఎవరు వ్యవహరిస్తారని చర్చనీయాంశంగా మారింది.



సోలార్ పనులపై దృష్ఠి సారించాం...
-ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్


ఆర్జీ-3 లో సోలార్ ప్లాంట్ ల నిర్మాణంపై దృష్ఠి సారించాం. కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగింది. 22 మెగా వాట్ల ప్లాంట్ 80 శాతం పూర్తి అయింది. రూ.50 కోట్లతో టెండర్లు పిలిచాం. 37 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణంకు కొద్దిగా భూవివాదం మూలంగా పనులు ఆలస్యం అవుతున్నాయి. ఓసీపీ-1 డంప్ యార్డ్ పై పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.