BREAKING
ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక జీహెచ్‌ఎంసీ క్రీడా పోటీలు–2026 ప్రారంభం సిబిఎస్ఇ జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం

మానవత సేవకు ముందడుగు

Select Suryaa Now
మానవత సేవకు ముందడుగు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం  మానవత్వంతో సేవే లక్ష్యంగా గోకవరం కైలాసగిరి నిర్వాహకులు సుంకర వీరబాబు అందిస్తున్న సేవలకు మరో గుర్తింపు లభించింది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను అందజేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నాయి. గతంలో గోకవరం ప్రాంతంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం రాజమహేంద్రవరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఈ పరిస్థితిని గుర్తించిన సుంకర వీరబాబు గ్రామ పెద్దలు, దాతల సహకారంతో గోకవరంలో కైలాసగిరిని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా దిక్కులేని అనాథ శవాలకు ఒక్క రూపాయి తీసుకోకుండా అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. సుంకర వీరబాబు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను అందించాయి. ఈ కార్యక్రమానికి తనవంతు సహకారంగా గజింగం సత్తిబాబు రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఫ్రీజర్ కొనుగోలుకు తోడ్పడ్డారు. తాను మానవతా సంస్థలో సభ్యుడిగా సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుంకర వీరబాబు మాట్లాడుతూ గోకవరం మండలంలో ఏ గ్రామానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారు మరణించినా వారి కుటుంబాలకు అవసరమైన ఫ్రీజర్ సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటల్లో అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. కైలాసగిరి సేవలకు తనతో పాటు పలువురు సభ్యులు, దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి ఆసరాగా నిలిచే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకం. మానవత్వానికి కులమతాలు లేవని చాటుతున్న గోకవరం కైలాసగిరి సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.