పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: అమీనుద్ధీన్, భాగ్యానంద్
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కోసం, అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ గ్రేట ర్ మాజీ కార్యదర్శి అమీనుద్ధీన్, మౌలాలి డివిజన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయ కుడు మోనార్ భాగ్యానంద్ రావులు కోరారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మౌలాలి డివిజన్ పరిధిలోని ఎంజే కాలనీ గాయత్రీ నగర్ కాల నీలలో పట్టభద్రుల ఓటరు నమోదుకు దర ఖాస్తు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా బీఆర్ ఎస్ నాయకులు అమీనుద్ధీన్, భాగ్యానంద్ రావులు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవ స్థలో ఓటు హక్కు కీలకమని, దానిని విని యోగించుకోవడంతో పాటు ఓటరు జాబితా లో తమ పేరు ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందీప్, లడ్డూ, నవాబ్, శివ శంకర్ రావు, చోటూ, భరత్, మంజునాథ్, సూరి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు