telangana
సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి
సూర్య, హుజురాబాద్:ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలని, లేకపోతే మోసపోవాల్సి వస్తుందని ఏఎస్ఐ కమల అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వివిధ రకాల ప్రయోజనాల పేరుతో మనము మోసం చేయడానికి ప్రయత్నిస్తారని, ఫోన్లు చేస్తారని, వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. మనకు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పడం గాని మన పాస్ వర్డ్స్ తెలియపరచడం గాని చేయరాదన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రహీం, హోంగార్డు లక్ష్మీనారాయణ, పలువురు ప్రజలు పాల్గొన్నారు.