telangana
టిజిపిసిబిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో “జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని” నిర్వహించారు. ఈ సందర్భంగా టిజిపిసిబి అధికారులు, సిబ్బంది సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను ఆలపించారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో కృషి చేస్తామని, దేశ ప్రజల మధ్య ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోని పలు సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి, దేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన అసమానమైన కృషిని ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు. విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, భాషలతో కూడిన భారతదేశాన్ని ఐక్యంగా నిలపడంలో ఆయన పోషించిన చారిత్రక పాత్రను కొనియాడారు. వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జాతీయ ఐక్యత, సమగ్రత, సోదరభావ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎ. రవీందర్, హైదరాబాద్.
Ravi, 7799457144