telangana
వజ్రేష్ యాదవ్‌కు ఘట్‌కేసర్ కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలు బోడుప్పల్‌లోని దేవి కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొక్క సత్తిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వజ్రేష్ యాదవ్‌ను పూలమాలలు, శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రమోద్ యాదవ్, కట్ట సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్, సాయి చరణ్ రెడ్డి, వంగ హరి వర్ధన్ రెడ్డి, వివేక్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.