BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా

Select Suryaa Now
మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా

మచిలీపట్నం మేజర్ న్యూస్ : మచిలీపట్నం నగరాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో నిలపడమే తన లక్ష్యమని కూటమి బలపరిచిన టీడీపీ మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం 55వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి పి.వి. ఫణికుమార్ నివాసం వద్ద కార్పొరేటర్ అభ్యర్థి పి. విమల గాయత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, కూటమి నాయకుల సహకారంతో నగరంలో మురుగునీటి పారుదల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 55వ డివిజన్‌లోని రేవతి సెంటర్, జిల్లా కోర్టు సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్లలో వర్షాలు కురిసినప్పుడు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం చేపడుతున్న మురుగునీటి కాలువల పనులతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్థానిక పెద్దల సహకారంతో మరిన్ని చర్యలు చేపడతానన్నారు. 55వ డివిజన్ అభివృద్ధి కొనసాగాలంటే కార్పొరేటర్ అభ్యర్థి విమల గాయత్రిని గెలిపించాలని కూటమి నాయకులు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మహిళలు అబీదా, విమల గాయత్రికి హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ అసిన్ బేగ్, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, పలువురు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.