గీత పనివారాల సంఘం అధ్యక్షులుగా కుమారస్వామి
గార్ల, 19, మేజర్ న్యూస్, గీత పని వారల సంఘం మండల అధ్యక్షులు గా కుమారస్వామి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మండల కేంద్రం లోని సిపిఐ రాష్ట్ర సీనియర్ నేత, స్వాతంత్ర సమర యోధులు తోడేటి కొమరయ్య నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కొమరయ్య మాట్లాడుతూ.. గీత పనివారల సంఘం స్థాపించి నేటితో 70 సంవత్సరాలన్నారు. గీత పనివారాల సంఘం జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర నాయకులు నాగార్జున గౌడ్ జిల్లా గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు దొంతి రామ్మూర్తి ల సమక్షంలో మండల గీత పనివారాల సంఘం అధ్యక్షుడిగా గనేబోయిన కుమారస్వామి, కార్యదర్శిగా కత్తి రాజేష్, పట్టణ అధ్యక్షులుగా మోత్కూరు వెంకటరాజ్యం, కార్యదర్శిగా కత్తి శివ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ సంఘం సభ్యులుగా తాళ్ళపల్లి కృష్ణా, తోడేటి శ్రీనివాస్, మండ రవి, గాజుల కృష్ణ, తోడేటి రవి, సత్యనారాయణ, తోడేటి నాగరాజు, తండా నాగులు, మోటపోతుల రాంబాబు, బూర్ల రాము, కత్తి వెంకన్న తదితరులు ఎంపికైన వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
రిపోర్టర్; నాగేశ్వరరావు ,గార్ల, మహబూబాబాద్ జిల్లా