BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

ప్రజావాణికి ప్రజల స్పందన కరువు..!

Select Suryaa Now
ప్రజావాణికి ప్రజల స్పందన కరువు..!

సూర్య, నాగిరెడ్డి పేట్,ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తుదారులు ఒక్కరు కూడా రాకపోవడంతో అధికారులు గంటల తరబడి ఖాళీగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. సుమారు నాలుగు గంటలపాటు ప్రజల కోసం కేటాయించిన సమయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందకపోవడంతో అధికారులు తమ విధులను పక్కనపెట్టి దరఖాస్తుదారుల రాక కోసం నిరీక్షించాల్సి వస్తోంది.‌ మండల స్థాయి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో  ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, ప్రజలు తమ సమస్యలను సంబంధిత శాఖల వద్దనే నేరుగా అధికారులకు తెలియపరుస్తుండడం,వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం వంటి కారణాలతో ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య తగ్గుతుంది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో వారం వారం ఏర్పాటు చేస్తున్న ప్రజావాణికి‌  దరఖాస్తుదారులు రాక ప్రజావాణి ప్రత్యేక హాల్ వెలవెలబోతోంది. ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాల్సి ఉండగా, ఫిర్యాదుదారులు రాకపోవడంతో సమయం మొత్తం అక్కడే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమ సమస్యలను మండల స్థాయి అధికారులకు తెలియపరిస్తే సమస్య పరిష్కారం అవుతుందో లేదో నాన్న కారణంగా పలువురు మండల వాసులు జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను జిల్లా ఉన్నత అధికారులు సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయి అధికారులను ఆదేశిస్తూండ డంతో పలు ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగాలంటే 
ప్రజావాణి కార్యక్రమంపై  ప్రజలకు మరింత అవగాహన కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కార ప్రక్రియపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.