దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డా. చంద్రప్రియ
వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ పట్టణంలోని అలంపల్లి దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటు శివారెడ్డిపేటలో నిర్వహించిన దుర్గామాత పూజా కార్యక్రమంలో డా. చంద్రప్రియ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త అనిల్, యువ నాయకుడు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.