హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు
హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని హరిహర క్షేత్రం గా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సమక్షంలో మంగళవారం విజయదశమిని పురస్కరించుకొని శివాలయ ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద శమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివ కేశవులను జమ్మి చెట్టు వద్ద అర్చకులు ఊటుకూరు సత్యనారాయణ శర్మ, ప్రతాపురం ప్రసాదా చార్యులు, శమి పూజలు నిర్వహించి విజయదశమి రోజు శమీ పూజ ప్రాముఖ్యతను వివరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం శివకేశవుల నామస్మరణతో మారుమోగింది. అనంతరం భక్తులకు జమ్మి ఆకులను, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ వనమా గాంధీ, వర్తక సంఘం అధ్యక్షులు వేముల నగేష్, పలు గ్రామాల పెద్దలు, భక్తులు దోసపాటి రాంబాబు, వనమ శ్రీను, వీరబోయిన నాగేశ్వరావు, హరిహర అయ్యప్ప పీఠం గురుస్వామి వెంకటరావు స్వామి, మహిళలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు..