BREAKING
భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం!

సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Select Suryaa Now
సలాం పోలీస్...  - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు  అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్వహించ నున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, ఎండా వానలను లెక్కచేయకుండా ప్రజా భద్రతే లక్ష్యంగా పనిచేసే పోలీసుల సేవలు, త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఎలాంటి అభద్రత, అశాంతి, ఆందోళన లేకుండా జీవిస్తున్నారంటే దేశ సరిహద్దులో సైనికుడి నుంచి పట్టణ వీధుల్లో గస్తీ తిరుగు తున్న హోంగార్డు దాకా అందరి కృషి దాగి ఉంది.  పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదే. పండగ రోజున అందరూ కుటుంబ సభ్యులతో గడుపుతుంటే పోలీసులు మాత్రం విధుల్లో ఉంటూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. ఇలా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఎంతోమంది పోలీసులు అసువులు బాసి కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు. బుధవారం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోటు చేసుకున్న పలు విషాద ఘటనల పై సూర్య న్యూస్ ప్రత్యేక కథనం... 
ఉమ్మడి జిల్లాలో జరిగిన ఘటనలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మావోయిస్టు తూటాలకు ఇప్పటి వరకు 39 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
మహబూబ్నగర్ చరిత్రలో మొదటిసారిగా 1990 లో కోడేరు మండలంలోని తుర్కదిన్నె వద్ద ఎమ్మెల్యే ఇంటి పై మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ బలయ్యాడు.
*1991లో వంగూరు పోలీస్ స్టేషన్పై దాడి చేయగా కానిస్టేబుల్ ఖాజాపాషా ప్రాణాలు వదిలాడు. అదే ఏడాది కొల్లాపూర్ లోని ఓ హోటల్లో ప్రభాకర్ అనే కాని స్టేబుల్ భోజనం చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు. * 1983లో కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద అప్పటి మహబూబ్నగర్ ఎస్సీ పరదేశీనాయుడు, సిబ్బందితో కలిసి బస్సులో వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపా తర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఎస్పీతోపాటు ఇద్దరు ఎస్ ఐలు కిషోర్కుమార్, శివప్రసాద్, హెడా నిస్టేబుల్ రంగా రెడ్డి, కానిస్టేబుళ్లు సుఖాజ్, జహబ్ ఇక్బాల్, జయరాం, వైవీఎస్ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘ టన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
*1984లో తలకొండపల్లి పోలీసే స్టేషన్పై మావో యిస్టులు జరిపిన దాడిలో ఫసియుద్దీన్ అనే కానిస్టే బుల్ మృతిచెందాడు.
*1996లో కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్లలో ఎన్నికల విధుల్లో ఉన్న మురళీధర్ రెడ్డి అనే కానిస్టే బులు నక్సల్స్ కాల్చిచంపారు.
*1997లో బల్మూర్ పరీక్షల బందోబస్తు నిర్వహి స్తున్న చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నక్సల్స్ తూటాలకు బలయ్యారు. అదే ఏడాదిలో అమ్రాబాద్ పరిధి లక్ష్మాపూర్ నుంచి ట్రాక్టర్ వెళ్తున్న ఎస్ఐ మల్సూర్. కానిస్టేబుళ్లు నాగేశ్వరుడు, జగదీశ్వర్రెడ్డి, మారెప్ప, శంకరయ్య మందుపాతరాకు బలయ్యారు. అదే ఏడా దిలో అమ్రాబాద్ వద్ద పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహబూబ్ అలీఖాన్ అనే కానిస్టేబుల్ మరణించాడు.
*1999లో వీపనగండ్ల వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరకు ఎస్ఐ భాస్కర్రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, గోపాల్ బలయ్యారు.
*2000 ఏడాదిలో కానిస్టేబుల్ హన్మనాయకున్ను, 2001 లో హోంగార్డు శ్రీనివాసరాజును అచ్చంపేట పరిధిలోని ఎదిరలో మావోయిస్టులు హతమార్చారు.
*2001లో అమనగల్ సమీపంలోని కాటన్ మిల్లు వద్ద జరిగిన ప్రమాదాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన ఎస్ఐ హన్మంతురెడ్డిని నక్సలైట్లు కాల్చిచంపారు.
*2002లో మన్ననూర్ పండరీ అనే కానిస్టేబులు, 2004 లో కొల్లాపూర్ ఎమ్మెల్యే గన్ మెన్లు హుమ్లా నాయక్, వెంకటే డ్డిలను కాల్చిచంపారు. అదీ ఏడాది అడ్డాకుల ఎంపీపీ నారాయణ గన్ మెన్ సుగుణకార్ ను కాల్చిచంపారు.
*2015లో బాలానగర్ ఎస్ఐని హతమార్చేందుకు మా వోయిస్టులు రెక్కీ నిర్వహించి.. చివరికి ప్రకాష్ అనే కానిస్టే బుల్ కాల్చారు. ఇదే ఏడాదిలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఎదుట నిల్చున్న హెడ్ ని స్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ శేఖరనాయక్లను మావోయిస్టులు హతమార్చారు.
*నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గన్మెన్ రాజారెడ్డి నక్సల్స్ తూటాలకు బలయ్యారు. అలాగే చిన్నచింతకుంట ఎస్ఐ అహ్మద్ మొహియుద్దీనన్ను పోలీస్ స్టేషన్ ఎదుటే పట్టపగలు కాల్చిచంపారు.
*2006లో కొండనాగులలో జహంగీర్ అనే హెడ్కానిస్టేబుల్, అదే ఏడాది కూంబింగ్ నిర్వహిస్తున్న జోషాబాబు అనే గ్రేహౌండ్ కానిస్టేబుల్ను అత్యంత దారుణంగా హతమా ర్చాడు. అదే ఏడాది కొల్లాపూర్ పరిధిలోని సింగోటం వద్ద రమేష్ అనే కానిస్టేబుల్ మావోల తూటాలకు బలయ్యాడు.
*ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులకు నివాళులు
ఉమ్మడి మహబూబ్నగర్లోని నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలోని పోలీస్ పరేడ్ మైదానంలో అమరులకు నివాళులర్పించడంతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతిరాలిని నిర్వహిస్తారు. అదేవిధంగా అన్ని జిల్లాల ఎస్పీలు అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి చర్చించనున్నారు..

పి.వినయ్ కుమార్ , నాగర్ కర్నూల్ క్రైమ్ , సూర్య న్యూస్