మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు
సూర్య - మానకొండూర్ : మండలంలోని వన్నారం గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు శ్రీకాంత్ యువసేన, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో అత్యంత ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కూడలిలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తాళ్లపెళ్లి శ్రీకాంత్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
ఈ వేడుకల్లో యువ నాయకులు మాట్లాడుతూ.. తాళ్లపెళ్లి శ్రీకాంత్ ఇలాంటి జన్మదిన వేడుకలను నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని అత్యున్నత పదవులు అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు.
తనపై ఉన్న అభిమానంతో జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, తన అభిమానులకు తాళ్లపెళ్లి శ్రీకాంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రీకాంత్ యువసేన సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.