దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ
*దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌లో ఆయుధపూజ*
దేవరుప్పుల , మేజర్ న్యూస్, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ చింత రాజు ఆధ్వర్యంలో ఆయుధపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, విజయదశమి శుభాకాంక్షల మధ్య సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఆయుధపూజలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తత, అంకితభావం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
రిపోర్టర్ ;ఎల్లేష్ ,దేవరుప్పుల ,జనగామ జిల్లా