BREAKING
భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం!

భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర

--ఆటపాటలతో అంబరాన్నంటిన ఆధ్యాత్మిక సందడి.

నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు గత 11రోజులుగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం అమ్మవారి శోభాయాత్రను కనుల పండువగా నిర్వహించారు.ఈ శోభాయాత్రలో మహిళలు,యువకులు,పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.సంప్రదాయ సంస్కృతులు ఉట్టిపడేలా ఆటపాటలతో సాగిన శోభాయాత్ర మండల కేంద్రంలో ఆధ్యాత్మిక సందడిని నింపింది.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిని చాటుకున్నారు.11రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు ధర్మాపురం ప్రేమ్,సుధాకర్,బచ్చు సురేష్ కుమార్,బచ్చు రాఘవేందర్,బచ్చు బాలరాజు,రొక్కం రాఘవేందర్,ఆగిరి అశోక్,చిగుళ్లపల్లి శ్రీధర్,బచ్చు సంతోషి, ధర్మపురి గీత,బచ్చు గీత,రొక్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు