నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు
బయ్యారం, మేజర్ న్యూస్, రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ అధికారి కె.రాజు తెలిపారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడం,సేంద్రియ,ప్రకృతి వ్యవసాయం,సూక్ష్మ నీటిపారుదల,నీటి సంరక్షణ,చీడపీడల నివారణ,సమగ్ర పోషక యాజమాన్యం,వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు కార్యక్రమ వివరాలు అక్టోబర్ 22,ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు బయ్యారం రైతు వేదిక,కొత్తపేట రైతు వేదికలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని అధికారులు కోరారు.
రిపోర్టర్; స్వామి, బయ్యారం, మహబూబాద్ జిల్లా