ఎల్బీ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశంకి ఎంఆర్పీఎస్ నాయకుల శుభాకాంక్షలు
కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : ఎల్బీ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశంని ఎంఆర్పీఎస్ , ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ వెంకటేశంకి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్ము రాజశేఖర్ మాదిగ, ఎంఎస్పీ ఎల్బీ నగర్ కో-ఇన్చార్జి మల్లే పోగు రాజు మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు గోవిందు, హేమంత్ గుప్తా, అనంత సురేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అనంత నర్సింహా మాదిగ తదితరులు పాల్గొన్నారు.