BREAKING
దాడిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శ... హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ: అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీపై సెబీ కొరడా: రూ. 11.5 కోట్ల జరిమానా విధింపు.. బీపీసీఎల్ క్యూ2 ఆర్థిక ఫలితాలు: రూ. 4,993 కోట్ల నికర లాభంతో భారీ టర్న్‌అరౌండ్.. నష్టాల నుంచి బలంగా పుంజుకున్న ఎబిటా! కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్..

దాడిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శ...

Select Suryaa Now
దాడిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శ...

వెల్దుర్తి సూర్య ప్రతినిధి రూరల్ మేజర్ న్యూస్:  మండల పరిధిలోని అల్లుగుండు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీరామ్ రెడ్డి, మల్లికార్జున, శీలన్న, పకీరప్పలు టీడీపీ నాయకుల దాడిలో గాయపడి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం తెలుసుకున్న పత్తికొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవమ్మ  మాట్లాడుతూ. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమనే భయంతో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నించాల్సింది పోయి, ప్రత్యర్థి పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. ఎలాంటి బెదిరింపులకు,దాడులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలను ఎదుర్కోవాలని  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైకాపా నాయకులు దేశాయి సమీర్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి, వైకాపా నాయకులు తదితరులు పరామర్శించారు. సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం