BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్

Select Suryaa Now
బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్

గోకవరం, మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం ఎంపీటీసీ–1 స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దోసపాటి పెద్ద సుబ్బారావు సతీమణి నాగ వరలక్ష్మి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ–1 కంబాల శ్రీనివాసరావు బలపరిచిన అభ్యర్థిగా నాగ వరలక్ష్మి నామినేషన్ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. గోకవరం–తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం నుంచి కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలివచ్చారు. 

పార్టీ అభ్యర్థి నాగ వరలక్ష్మితో కలిసి అక్కడి నుంచి దేవిచౌక్‌లోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు నాగ వరలక్ష్మి, పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి సన్నిధిలో ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం దేవిచౌక్ నుంచి అభ్యర్థి నాగ వరలక్ష్మితో కలిసి కంబాల శ్రీనివాసరావు పార్టీ శ్రేణులతో ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అనంతరం గోకవరం ఎంపీటీసీ–1 స్థానానికి నాగ వరలక్ష్మి తన నామినేషన్ పత్రాలను, కంబాల శ్రీనివాసరావుతో కలిసి అధికారులకు సమర్పించారు. అభ్యర్థి నాగ వరలక్ష్మికి మద్దతుగా నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది.