ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు.
రామాయంపేట ; రామాయంపేట మండలం వెంకటాపూర్ ఆర్ బిఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఏడుపాయలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి. తిరుపతిరెడ్డి హాజరై రాజిరెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కల్వకుంట సర్పంచ్ అందె కొండల్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాల గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి నాయకులు మావురం రాజు, నాగరాజు, నర్సారెడ్డి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు.