BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Select Suryaa Now
టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

సంగారెడ్డి,  :- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీ.జీ.పి.ఎస్.సీ) ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లాలో నిర్వహించనున్న
అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ II), కంప్యూటర్ ఆధారిత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఈనెల 24న జరిగే అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ - I I),
పరీక్షకు సంబంధించి  గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎస్పీ పరతోష్ పంకజ్ తో కలిసి  కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, మొత్తం 150 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష రెండు సెషన్లలో ఉంటుందని, మొదటి సెషన్ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే  పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారని, ఉదయం 9.30 గంటలకు గేట్లు మూసివేస్తారని తెలిపారు. రెండో సెషన్‌కు మధ్యాహ్నం  1 గంట నుంచి అనుమతిస్తారని, మధ్యాహ్నం 2.00 గంటలకు గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. గేట్లు మూసివేసిన తర్వాత ఆలస్యంగా వచ్చే అభ్యర్థులకు అనుమతి ఉండదని తెలిపారు.పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఇతర సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు.
పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని, అభ్యర్థులకు పరీక్ష సమయానికి అవసరమైన రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలనీ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.   దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిడబ్ల్యుఓ కు సూచించారు.అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణ సాఫీగా ప్రశాంతంగా జరగడానికి తీసుకుంటున్న  భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పి పరతోష్ పంకజ్ వివరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, మహిళ శిశు వికలాంగుల శాఖ అధికారులు, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్, పటాన్‌చెరు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.