BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి

Select Suryaa Now
భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి

సిద్దిపేట్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం రెవెన్యూ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ భారతి–రీ సర్వే ప్రక్రియ, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ భూముల వివరాల సేకరణ, ప్రాజెక్టుల భూసేకరణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో ఎంపిక చేసిన రెండు గ్రామాల్లో భూ భారతి రీ సర్వే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రీ సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, సర్వేకు సంబంధించిన వివరాలను రోజువారీగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, జీపీఓలు ప్రతిరోజూ తప్పనిసరిగా 40 ఎకరాల చొప్పున సర్వే పూర్తి చేయాలని సూచించారు. ముందుగా గ్రామ సరిహద్దుల సర్వే చేపట్టాలని, సర్వే పూర్తయిన వెంటనే ఎల్‌ఆర్‌ అందించాలని స్పష్టం చేశారు.

పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి

భూ భారతి కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ నవంబర్ 5వ తేదీలోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలి

ప్రతి మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో, రికార్డుల ప్రకారం వాటి విస్తీర్ణం ఎంత ఉందో, వాటిలో ఆక్రమణకు గురైన భూములు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలను సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని సూచించారు.

భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

జిల్లాలో దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టుల కాలువల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. అలాగే తహసీల్దార్ల లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్న జీవో నంబర్ 59 దరఖాస్తులను క్లియర్ చేయాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్స్ సుదర్శన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, వివిధ మండలాల తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.