మహనీయుల ఆశయాలే యువతకు ఆదర్శం
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో పండుగ సాయన్న, కొమురం భీమ్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. నిజాం పాలనలో పేదల పక్షాన నిలిచి, అన్యాయాలను ఎదిరించిన పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరాడిన కొమురం భీమ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు మేకల వెంకన్న, డప్పు శ్రీనివాస్, ముల్కనూర్ ఉప సర్పంచ్ కాసగోని మమతా బాలకృష్ణ, మాజీ సర్పంచ్ ప్రెస్ కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఊసకోయిల ప్రకాష్,ఆదరి రవీందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్, నాయకులు మాడుగుల గోపి, చిట్కూరి అనిల్, పోగుల శ్రీకాంత్, మాడుగుల చింటూ, తకీల్, డబ్బా శంకర్, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా