ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్
నరసాపురం, మేజర్ న్యూస్ :పట్టణంలోని 19వ వార్డులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ప్రచారంలో పాల్గొన్నారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమం
సందర్భంగా వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నరసాపురం పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 19వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పాడ కృష్ణవేణి కి ప్రజలందరూ తమ సంపూర్ణ మద్దతు తెలిపి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.