BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు.

Select Suryaa Now
అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు ఇప్పటివరకు 49  నామినేషన్లు దాఖలు.

 అనపర్తి మేజర్ న్యూస్:అనపర్తి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికల నేపథ్యంలో గురువారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడంతో ఎన్నికల వాతావరణం నెలకొంది. గురువారం ఒక్కరోజే మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మండలంలో రాజకీయ కార్యకలాపాలు మరింత ఊపందుకున్నాయి.

 గురువారం దాఖలైన 28 నామినేషన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున అత్యధికంగా 16 నామినేషన్లు దాఖలయ్యాయి.తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి 8, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి 2, జనసేన పార్టీ నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థి తరఫున మరో నామినేషన్ దాఖలైంది. దీంతో మండలంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.అనపర్తి మండల పరిధిలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు మొత్తం 49 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. 

నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తుండటంతో రానున్న రోజుల్లో మరింత మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించే అవకాశముంది.మరోవైపు మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామాల్లోని రాజకీయ పరిస్థితులు, స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో ఎన్నికల పోటీపై ఆసక్తి పెరుగుతోంది.