అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి
ఏలూరు, మేజర్ న్యూస్ : దక్షిణపు వీధి 13వ డివిజన్ లో జనసేన అభ్యర్థి విస్తృత ప్రచారం చేశారు.
ఏలూరు అభివృధ్ధే తమ లక్ష్యం అని,కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జనసేన నాయకులు,సోషల్ సర్వీస్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు.ముందుగా డివిజన్ పెద్దలు,కూటమి నాయకులు వారికి జై జై లతో ఆత్మీయ మద్దతును పలికారు.ఈ సందర్భంగా సోషల్ సర్వీస్ మురళీకృష్ణ బలపరిచిన డివిజన్ కూటమి అభ్యర్థి మంగ ని 13వ డివిజన్ ప్రజలకు ఇంటింటికి వెళ్లి పరిచయం చేశారు.మురళీకృష్ణ సంక్షేమం అభివృద్ధి గురించి వివరిస్తూ,మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు వల్లనే ఏలూరు నగర సమగ్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు .సామాజికవేత్త గొంతిన రామకృష్ణ మాట్లాడుతూ మన పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ ఎన్నికలు కూటమి అభ్యర్థులకు ఒక మంచి అవకాశం అన్నారు.