సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
సూర్య, సత్తుపల్లి సత్తుపల్లి పట్టణంలో వైద్య సేవల విస్తరణ దిశగా మరో అడుగు పడింది. పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన *శస్త్ర హాస్పిటల్’* ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ లు ఘనంగా ప్రారంభించినారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాస్పిటల్ యాజమాన్యానికి, ప్రముఖ వైద్యులు డాక్టర్ వినీత్ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నూతన ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.
సత్తుపల్లి పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఆసుపత్రుల ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో కాకర్లపల్లి రోడ్డులో ప్రారంభమైన శస్త్ర హాస్పిటల్ స్థానిక వైద్య రంగంలో తనదైన సేవలను అందించాలని పలువురు ఆకాంక్షించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖ వైద్యులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ