రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు
రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు పెడన,మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయదశమి మంగళవారం గ్రామ దేవత శ్రీ పైడి మా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు అని ఆలయ కార్య నిర్వహణ అధికారి వెంకట కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణ ను భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెల్లవారుజామునండి మేళతాళాలతో అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు.