BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

ప్రజాసేవే లక్ష్యంగా..... ఒక్క అవకాశం ఇవ్వండి 31 వ డివిజన్ లో అభివృద్ధి చేసి చూపిస్తాం... జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ

Select Suryaa Now
ప్రజాసేవే లక్ష్యంగా..... ఒక్క అవకాశం ఇవ్వండి 31 వ  డివిజన్ లో అభివృద్ధి చేసి చూపిస్తాం...  జనసేన  కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ

తిరుపతి, మేజర్ న్యూస్ : 
ప్రజా సేవే  పరమావధిగా భావించి ప్రజాసేవకు శ్రీకారం చుడుతూ నగరంలోని 31వ డివిజన్ కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ  జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి  దిగారు.
ప్రజాసేవ తమకు సంతృప్తిని ఇస్తుందంటూ ప్రజల్లో ఉండి  ప్రజా నాయకురాలుగా నిలబడి 31వ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు. 31 వ డివిజన్ లో గడప గడపలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ప్రతి ఒక్కరినీ పేరు పేరుతో పలకరించే ఆప్యాయత ,అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు ఒక సోదరిగా కలిసిపోయే బంధుత్వం ఆమె సొంతం. నిరంతర ప్రజల్లో ఉంటూ ప్రజా నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకొని నేటితరం రాజకీయాల్లో కూడా ప్రజాసేవను గుర్తు చేస్తూ రాజకీయ పయనం కొనసాగిస్తున్నారు.  తనకంటూ జనసేన పార్టీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే తనయుడు అరణి మదన్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు క్రికెట్ విజయ్ కుమార్, ఆ పార్టీ నాయకుల  ఆశీస్సులతో  అండదండలతో జనసేన పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ నగరంలో 31వ డివిజన్ కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ బరిలోకి దిగి విజయ డంకా మోగించేందుకు సిద్ధమయ్యారు. 
భానుప్రియ భర్త సతీష్  సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా ఎంతోమంది క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడంలో ప్రత్యేకత చాటుకున్నారు. అంతేకాకుండా సతీష్ యాదవ్ 31 వ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ ఆపద వచ్చినా తాను ఉన్నానంటూ ముందు వరుసలో నిలబడి సాయం చేస్తూ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆయన సతీమణి  భానుప్రియ 31వ డివిజన్ కూటమి పార్టీలో భాగంగా జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. కావున ప్రజలు ఆదరించి ఓటు వేసి వేయించి గెలిపించగలరని జనసేన పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

H. Dwaraka, staff reporter, tpt.

PH.NO: 9705347341