BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

జోరు వానలో... ప్రచార హోరు తొలి రోజు ఎన్నికల ప్రచారానికి కూటమి శ్రీకారం

Select Suryaa Now
జోరు వానలో... ప్రచార హోరు  తొలి రోజు ఎన్నికల ప్రచారానికి కూటమి శ్రీకారం

తిరుపతి, మేజర్ న్యూస్ :
జోరు వాన ఓ వైపు... ప్రచార హోరు మరో వైపుతో తిరుపతి నగరంలో తొలిరోజు కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ @ మన్యం శ్రీనివాస్ ప్రసాద్ ప్రచారం సాగింది. ఎలాంటి ఆర్బాటాలు లేకుండా సాధారణంగా. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, తాతయ్యగుంట ఆలయ ఛైర్మన్ మహేష్ యాదవ్, జనసేన నాయకుడు ప్రణీత్ తో కలిసి తిరుపతికి ఈశాన్యం వైపున తిమ్మినాయుడు పాళెం హరిజనవాడలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లతో మమేకమవుతూ ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ... మేయర్ అయ్యాక చేపట్టబోయే అభివృద్ధిని వివరించారు. తిమ్మినాయుడు పాళెం ప్రజలు కర్పూర హారతులు అందిస్తూ స్వాగతం పలుకుతూ మేమంతా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నామంటూ భరోసా కల్పించారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


ద్వారక, స్టాఫ్ రిపోర్టర్, టీపీటీ.
సెల్ no :9705347341