BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

రూరల్ టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా బడి మౌనిక

Select Suryaa Now
రూరల్ టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా బడి మౌనిక

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ : 
తిరుపతి రూరల్ మండలం ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన బడి సుధా యాదవ్ సతీమణి బడి మౌనిక పేరును ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం మౌనిక పుదీపట్ల టిడిపి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
మొదట్నుంచి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం...
బడి మౌనిక భర్త బడి సుధా యాదవ్  మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. బడి సుధా యాదవ్ రూరల్ మండలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబానికి మొదటి నుంచి విధేయుడుగా ఉంటున్నారు. ఆమె ఆశీస్సులతోపాటు టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్  ఆ పార్టీ రాష్ట్ర  ముఖ్య నేతలతో  మంచి సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. 2014 లో టిడిపి ఎంపిటిసి అభ్యర్థిగా పుధిపట్ల నుంచి గెలుపొంది ఎంపిపి రేసులో ఉన్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన కుట్రల వల్ల కొంతమంది టీడీపీ ఎంపీటీసీలు వైసీపీలో చేరడంతో ఎంపీపీ పదవి బడి సుధా యాదవ్ నుంచి  త్రుటిలో చేజారి పోయింది. అయితే ఆయన ఏమాత్రం నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. 2021-2026 వరకు పుదిపట్ల గ్రామపంచాయతీ సర్పంచ్ గా జూన్ వరకు కొనసాగారు. 2019 ఎన్నికలలో పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు తిరుపతి రూరల్ మండలంలో టిడిపికి మెజార్టీ తీసుకురావడంలో బడి సుధా యాదవ్ కీలక పాత్ర పోషించారు. అప్పట్నుంచి పులివర్తి నాని వెంట నడుస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలుపు కోసం విశేషంగా కృషిచేసి రూరల్ మండలంలో అత్యధిక మెజారిటీ రావడంలో తన సత్తా చాటారు. దీంతో బడి సుధా యాదవ్ పై ఎమ్మెల్యేకి ప్రత్యేక అభిమానం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో బడి సుధా యాదవ్ సతీమణి మౌనిక ను ఖరారు చేశారు. అధికార పార్టీ కి చెందిన అభ్యర్థి కావడంతో ఆమె ఎంపిక ఇక లాంఛనమనే చెప్పవచ్చు. వైయస్సార్సీపి పార్టీ తరఫున వెంకటపతి నగర్ మాజీ సర్పంచ్ చిన్ని యాదవ్ సతీమణి ని పోటీలో పెట్టారు.


H. Dwaraka, staff reporter, tpt.
Cell no : 9705347341