BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

చట్టవిరుద్ధ వేధింపులపై ఫిర్యాదు చేస్తే న్యాయపరంగా పోరాడుదాం ....... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

Select Suryaa Now
 చట్టవిరుద్ధ వేధింపులపై ఫిర్యాదు చేస్తే న్యాయపరంగా పోరాడుదాం ....... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త  అంబటి మురళీకృష్ణ

 పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు నియోజకవర్గంలో వైసిపీ రాజకీయ కార్యకర్తలు, అభిమానులపై చట్టవిరుద్ధ ఒత్తిళ్లు, బెదిరింపులు, తప్పుడు కేసులు పెడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో రాజకీయ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి హక్కు అని అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పేరుతో చేపట్టే బైండోవర్ చర్యలు వాస్తవ సమాచారం చట్టబద్ధమైన కారణాలతోనే ఉండాలని అవి శిక్షించేందుకు కాకుండా శాంతిని కాపాడేందుకు మాత్రమే ఉపయోగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు.ఎవరైనా అధికారి చట్టవిరుద్ధంగా వ్యవహరించారని భావిస్తే ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. బెదిరింపులకు భయపడి హక్కులను వదులుకోవద్దని, అదే సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్