BREAKING
భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం!

పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత

Select Suryaa Now
పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత

విజయవాడ పశ్చిమ, మేజర్ న్యూస్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31 నుంచి 58వ డివిజన్ల వరకు పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం బి-ఫారాలు అందజేశారు. బ్రాహ్మణ వీధిలోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.