ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి
ఉయ్యూరు, మేజర్ న్యూస్: ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్‌ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ఉయ్యూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తమ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.