BREAKING
పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..!

సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు

Select Suryaa Now
సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ముగియడంతో విజయదశమి వేడుకల సందడి మొదలైంది. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కింది బజార్ పెద్ద చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించగా, అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లుచేపట్టారు.కింది బజార్ పెద్ద చెరువు కట్టపై ఎనిమిది టన్నుల పూలతో రూపొందించిన 32 అడుగుల మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరు వేదికలపై మహిళల ఆటపాటలు, కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. వేలాది మంది మహిళలు పాల్గొనడంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.

దసరా ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి

సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను జగ్గారెడ్డి సోమవారం రాత్రి స్వయంగా పరిశీలించారు. స్టేడియంలో కలియతిరుగుతూ ప్రధాన వేదిక నిర్మాణం, సౌండ్ సిస్టమ్, ప్రేక్షకుల సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరికీ అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన వేదిక ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సామాన్య ప్రజలు కూడా కార్యక్రమాలను సౌకర్యవంతంగా వీక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

చివరి వరుస వరకు వినిపించేలా సౌండ్ సిస్టమ్

దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు స్టేడియంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టంగా వినిపించేలా అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. చివరి వరుసలో కూర్చున్న ప్రేక్షకులకు సైతం కార్యక్రమాలు స్పష్టంగా వినిపించేలా సౌండ్ వ్యవస్థను సిద్ధం చేయాలని నిర్వాహకులకు తెలిపారు.స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన భారీ రావణాసురుడి ప్రతిమను కూడా ఆయన పరిశీలించారు. రావణ దహనం సమయంలో ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం బాణాసంచా ప్రదర్శనకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రేక్షకులకు సురక్షిత దూరంలో బాణాసంచా కాల్చే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.

మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు

గత మూడు దశాబ్దాలుగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారీ రావణాసురుడి ప్రతిమ దహనం, బాణాసంచా ప్రదర్శనలు, ప్రముఖ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.సద్దుల బతుకమ్మ సంబరాలతో పండుగ శోభను సంతరించుకున్న సంగారెడ్డి పట్టణం, విజయదశమి వేడుకల కోసం సిద్ధమవుతోంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు జార్జ్, బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, శ్రీహరి, బెస్త నగేష్ తదితరులు పాల్గొన్నారు.