హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక
హిందూపురం లో 50 మంది వైసీపీ ని వీడి టిడిపి లోకి చేరిక...
హిందూపురం మున్సిపాలిటీ 44 వార్డు లో 50 మంది వైసిపి నాయకులు టిడిపిలోకి చేరారు. వీరు ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర ఆధ్వర్యంలో చేరిక. వారికి టిడిపి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. 44 వార్డ్ నుండి 50 మంది అసిఫ్ , బాబా, శుభాన్, నూరుల్లా, ఇంటియాజ్, అసిఫ్, ఇనాయత్, ముబారక్ కుటుంబాలు చేరారు. గత ప్రభుత్వంలో వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, భవిష్యత్ పై ఆశ కానీ లేదు అందువలన ఈరోజు ఎంఎల్ఏ గారు చేస్తున్న అభివృద్ధి చూసి మేమందరం మూకుమ్మడిగా టీడీపీ లో చేరడం జరిగింది అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర , బాలాజీ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పురిడి మంజునాథ్, పట్టణాధ్యక్షుడు వెంకటేష్, రామకృష్టప్ప, 44 వార్డు అభ్యర్థి గిరిధర్ మరియు వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర