BREAKING
పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..!

16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి

Select Suryaa Now
16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి

ఉయ్యూరు, మేజర్ న్యూస్: ఉయ్యూరు పట్టణ అభివృద్ధికి ప్రజలు తమ ఓటును బలమైన పునాదిగా మార్చాలని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, 16వ వార్డు జనసేన కౌన్సిలర్ అభ్యర్థి ఇస్లావత్ చింతయ్య విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం ఆయన వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను గెలిపించాలని, టీడీపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ వల్లభనేని నాని, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, రత్నం శివప్రసాద్ బుజ్జి, జంపన శ్రీనివాస్, సయ్యద్ మతుల్లా, ఫణికుమార్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరాం ప్రసాద్, మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్, సగర కార్పొరేషన్ డైరెక్టర్ వీరస్వామి, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.