దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి-సర్పంచ్ దాసరి రమేష్
*ఖానాపురం, మేజర్ న్యూస్, నేడు దసరా పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరూ ప్రశాంతత వాతావరణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సర్పంచ్ దాసరి రమేష్ పిలుపునిచ్చారు. దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని,ఈ పండుగను అందరూ కలిసిమెలిసి ఐక్యతతో,సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని దసరా పండుగను జయప్రదం చేయాలని సర్పంచ్ రమేష్ పిలుపునిచ్చారు. మన గ్రామం ఐక్యతను గ్రామస్తులు కాపాడుతూ దసరా లో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని,ఏదైనా సమస్య ఉంటే గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్ ;అనిల్, ఖానాపూర్ ,వరంగల్ జిల్లా