లింగాల ఘణపురం నూతన ఎస్సైగా కల్తి కిషోర్ బాధ్యతల స్వీకరణ
లింగాలఘణపూర్, మేజర్ న్యూస్, లింగాల ఘణపురం మండల నూతన సబ్-ఇన్‌స్పెక్టర్ గా కల్తి కిషోర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేసిన ఆయన, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా అధికారికంగా ఛార్జ్ తీసుకున్నారు.ఈ సందర్భంగా నూతన ఎస్ఐ కిషోర్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా సామాన్య ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, గుట్కా, పేకాట వంటి అక్రమ దందాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలు, యువత పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు నూతన ఎస్ఐకి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్; కార్తీక్ ,లింగాల గణపురం జనగామ జిల్లా