BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం

Select Suryaa Now
విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం విజయదశమి పర్వదినంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా జగన్మాత కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల ముగింపు వేడుకలకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 2.30 నుంచి 3 గంటల మధ్య నుంచే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్‌ తెలిపారు. నవరాత్రుల సందర్భంగా యాగశాలలో నిర్వహిస్తున్న హోమ క్రతువులు ఉదయం 10.30 గంటలకు జరిగే మహాపూర్ణాహుతితో ముగియనున్నాయి. అనంతరం అమ్మవారికి మహానివేదన సమర్పిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 3.45 గంటలకు మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల నగరోత్సవం ప్రారంభమై కృష్ణానది తీరానికి చేరుకుంటుంది. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య కృష్ణానదిలో విద్యుద్దీపాలతో అలంకరించిన హంసవాహనంపై స్వామి, అమ్మవార్ల దివ్య తెప్పోత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై సాయంత్రం పంచహారతులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) తెలిపారు. తెప్పోత్సవం అనంతరం ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి కొండపైకి తీసుకువస్తామని వెల్లడించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్‌, చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ వి. త్రినాథరావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ పాల్గొన్నారు. విజయదశమి ముగింపు వేడుకలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో వీక్షించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని అధికారులు కోరారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.