BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Select Suryaa Now
స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

విజయవాడ మేజర్ న్యూస్ : గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలు–2026ను ప్రశాంత వాతావరణంలో,  పారదర్శకంగా,  నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజలు, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన ఉన్నతస్థాయి వీడియో సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత, ఎన్నికల నియమావళి అమలు, వ్యయ పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల ఖర్చులపై వచ్చే ఫిర్యాదులను నిబంధనల ప్రకారం పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను వెంటనే జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని పేర్కొన్నారు. ఎన్నికల ఫిర్యాదులపై ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సాధారణ పరిశీలకురాలు ఎస్. నాగలక్ష్మిని 7680980032 నంబరులో  లేదా mdapgenco2025@gmail.com ద్వారా, వ్యయ పరిశీలకుడు ఎం. శివప్రసాద్‌ను 9866238885 నంబరులో లేదా ssluckysiva@gmail.com  ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. వ్యయ పరిశీలకుడి కార్యాలయాన్ని విజయవాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమిష్టిగా సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో సాధారణ పరిశీలకురాలు ఎస్. నాగలక్ష్మి, వ్యయ పరిశీలకుడు ఎం. శివప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యాన్‌చంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.