ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం
ఉయ్యూరు మేజర్ న్యూస్ : ఉయ్యూరు మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రెండో వార్డులో కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ అభ్యర్థి మోపిదేవి కృష్ణవేణి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ప్రచారంలో పాల్గొని కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకున్నారు. ఉయ్యూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల మెరుగుదలకు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి వార్డులో అవసరమైన సదుపాయాలు కల్పించి మెరుగైన సేవలు అందించడమే కూటమి లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.